17 కేజీల బరువు తగ్గక ముందు ఇలా ఉ‍న్నాను: తనుశ్రీ దత్తా

9 Sep, 2021 19:48 IST|Sakshi

‍నందమూరి బాలకృష్ణ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది నటి తనుశ్రీ దత్తా. ఫేమినా మిస్ ఇండియా యూనివ‌ర్స్‌గా 2004లో టైటిల్‌ కైవసం చేసుకున్న ఆమె ‘ఆశిక్ బ‌నాయా ఆప్నే’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను, దర్శక-నిర్మాతలను ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించింది.  2006లో ‘వీర‌భ‌ద్ర’ అనే సినిమాలో బాలకృష్ణ సరసన ఆడిపాడిన తనుశ్రీ ఆ తర్వాత తెరపై కనుమరుగయ్యింది. 

అప్పటి నుంచి నటకు బ్రేక్‌ ఇచ్చిన ఆమె వీపరీతంగా బరువు పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆ మధ్య మీటూ ఉద్యమానికి తెరలేపుతూ వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌ నటుడు నానా ఫటేకర్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ మీడియా ముందు బహిరంగ వ్యాఖ్యలు చేసింది. ‘హార్న్‌ ఓకే ఫ్లీజ్‌’ అనే మూవీ సాంగ్‌ షూటింగ్‌లో అతడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ తన గొంతును వినిపించడంతో మిగతా నటీమణులు కూడా ధైర్యంగా ముందుకు వారు ఎదుర్కొన్న లైంగిక ఘటనలపై నోరు విప్పారు. ఆ తర్వాత మీటూ ఉద్యమం ఎంతగా వివాదమైందో తెలిసిందే. ఆ తర్వాత ఆమె మళ్లీ తెరమరుగయ్యింది.

ఈ సమయంలో తనుశ్రీ బోద్దుగా కనిపించన సంగతి తెలిసిందే. అ‍యితే త్వరలో ఆమె సినిమాల్లోకి రీఎంట్రీకి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు 17 కేజీల బరువు తగ్గిందట. అంతేగాక సన్నగా, నాజుగ్గా తయారయ్యాక వరుసగా తన ఫొటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. ఈ క్రమంలో ‘నేను 17కేజీల బరువు తగ్గడానికి ముందు ఇలా ఉన్నాను’ అంటూ గతంలో లావుగా ఉన్న ఫొటోను షేర్‌ చేసింది.  ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా బొద్దుగా ఉన్నందున చాలా సార్లు బాడీ షేమింగ్‌కు గురైనట్లు గతంలో తను ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘చాలా మంది నేను లావుగా ఉన్ననని నా ముందే హేళన చేశారు, మరికొందరూ ముందు నాతో నవ్వుతూ మాట్లాడి, వెనకాల నా బరువు గురించి మాట్లాడుకునే వారు’ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial)

మరిన్ని వార్తలు