Raj Kundra Case: అవి పోర్న్‌ కాదు సాఫ్ట్‌ పోర్న్‌ అంటోన్న డైరెక్టర్‌

28 Jul, 2021 17:38 IST|Sakshi

నీలి చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు దర్శకుడు తన్వీర్‌ హష్మిని మూడు గంటల పాటు విచారించారు. ఈ కేసులో అరెస్టయి బెయిల్‌ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా మాట్లాడుతూ జీవితంలో ఇప్పటివరకు రాజ్‌ కుంద్రాను కలవనేలేదన్నాడు. తాము నగ్నచిత్రాలు తీసినప్పటికీ కుంద్రా కంపెనీతో తమకెలాంటి సంబంధం లేదన్నాడు.

'మేము 20-25 నిమిషాల నిడివి ఉండే లఘు నగ్న చిత్రాలు తీశాము. కానీ వాటిని పోర్న్‌ చిత్రాలు అని కాకుండా సాఫ్ట్‌ పోర్న్‌ అని పిలవచ్చు. అయినా ఇతర ప్లాట్‌ఫామ్స్‌ కూడా బోల్డ్‌ చిత్రాలు తీస్తున్నాయి. అలాంటివాటిని ఎందుకు ప్రశ్నించరు?' అని నిలదీశాడు. కాగా నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

మరిన్ని వార్తలు