Tara Sutaria-Aadar Jain: రణ్‌బిర్‌-అలియాల కంటే ముందే ఈ జంట పెళ్లి!

20 Nov, 2021 15:03 IST|Sakshi

Tara Sutaria And  Aadar Jain Tie Knot Soon: ఈ ఏడాది బాలీవడ్‌ లవ్‌బర్డ్స్‌ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే హీరో రాజ్‌ కుమార్‌ రావు తన చిరకాల ప్రేయసి పత్రలేఖను పెళ్లి చేసుకోగా.. త్వరలో విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌-అలియా భట్‌ ఈ డిసెంబర్‌లో బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు కొద్ది రోజులు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో బాలీవుడ్‌ జంట కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు తొందర పడుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ నటి తారా సుతారియా, నటుడు ఆదార్‌ జైన్‌ల వివాహం త్వరలోనే జరగనుందంటూ బి-టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆదార్‌ జైన్‌ ఎవరో కాదు రణ్‌బీర్‌ కపూర్‌కు కజిన్‌. 

చదవండి: మెగా డాటర్‌ శ్రీజ పోస్ట్‌పై సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ ఆసక్తికర కామెంట్‌

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2’, ‘మ‌ర్ జవాన్’ చిత్రాల‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తారా సుతారియా, నటుడు ఆదార్ జైన్‌లు కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. మిగతా ప్రేమ జంటల మాదిరిగా ఈ జంట తమ రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచకుండ ఎప్పటికప్పుడు బయటకు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తరచూ సోషల్‌ మీడియాలో ఒకరి ఫొటోలను ఒకరు షేర్‌ చేసుకోవడం, విందులు వినోదాలకు కలిసి వెళ్లడం, జంటగా హాలీడే వెకేషన్స్‌కు వెళ్లడమే కాకుండా అక్కడ వారు ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను కూడా షేర్‌ చేస్తుంటారు.అంతేగాక ఇటీవల జరిగిన ఆదార్‌ జైన్‌ సోదరుడి వివాహా వేడుకకు తారా సుతారియా కూడా హజరైంది.

చదవండి: పెళ్లి తర్వాత కత్రీనా పేరు మార్చుకుంటుందా..?

ఈ నేపథ్యంలో వీరిద్దరూ కూడా త్వరలో ఒక్కటవ్వాలనుకుంటున్నారట. అందుకే ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల్లో కూడా చెప్పడంతో వారు పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట.  దీంతో కత్రీనా-విక్కీ, రణ్‌బీవర్‌-అలియా మాదిరిగా వచ్చే ఏడాది సమ్మర్‌లోగా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రణ్‌బిర్‌-అలియాల పెళ్లి కంటే ముందు వీరి పెళ్లి జరిగేలా ఉందంటూ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం తారా సుతారియా ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ త‌డ‌ప్ చిత్రంతోపాటు హీరోపంతి 2, ఏక్ విల‌న్ రిట‌ర్న్స్ చిత్రాల్లో న‌టిస్తోంది. 

మరిన్ని వార్తలు