Tara Sutaria: హీరోలను సర్‌ అంటారు, కానీ మమ్మల్నెందుకో..

24 Jul, 2022 11:02 IST|Sakshi

ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తారా సుతారియా. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు ఇచ్చే గౌరవంలో తేడా కనిపిస్తూ ఉంటుంది. హీరోలను సర్‌ అని పిలుస్తూ ఉంటారు, అదే మా విషయానికి వచ్చేసరికి మాత్రం పేరు పెట్టి పిలుస్తారు. ఫొటోగ్రాఫర్లు మమ్మల్ని కూడా మేడమ్‌ అని పిలవాలని చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడే అబ్బాయి గొప్ప అని చెప్పకనే చెప్తున్నారు' అని పేర్కొంది. కాగా  ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ మూవీలో జాన్‌ అబ్రహం, అర్జున్‌ కపూర్‌, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించారు. మోహిత్‌ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది.

చదవండి: ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బులిచ్చా.. సమంత షాకింగ్‌ కామెంట్స్‌
సీరియల్‌లో నిఖిల్‌ ఎంట్రీ.. మామూలుగా ప్లాన్‌ చేయలేదట!

మరిన్ని వార్తలు