ముక్కలైన విమానం.. హాలీవుడ్ నటుడి దుర్మరణం

31 May, 2021 08:56 IST|Sakshi

వాషింగ్టన్​: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న జెట్ విమానం కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. వీరిలో నటుడు జోయ్​ లారా ఉన్నట్లు తెలుస్తోంది.  కాగా, జోయ్​ లారా ‘టార్జన్​’ సిరీస్​లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు.

శనివారం ఉదయం టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాకు విమానం వెళ్తుండగా.. 11 గంటల సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. సౌత్​ నాష్​విల్లేలోని పెర్సీ స్ట్రీక్​ లేక్​లో విమాన శకలాలు కూలినట్లు ఫెడరల్ ఏవియేషన్​ అడ్మినిస్ట్రేషన్​ ప్రకటించింది. ఈ ఘటనలో చనిపోయినవాళ్లలో నటుడు జోయ్​ లారా, అతని భార్య గ్వెన్​ ష్వాంబ్లిన్ ఉన్నారు. కాగా, ఈ దుర్ఘటనలో శకలాలు చెల్లాచెదురు అయ్యాయని, సోమవారం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తామని అధికారులు చెప్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.  

కాగా, లారా(విలియమ్​ జోసెఫ్​ లారా) 1989లో వచ్చిన ‘టార్జాన్ ఇన్​ మాన్​హట్టన్’​ సినిమా ద్వారా ఫేమస్​ అయ్యారు. ఆ తర్వాత 1996 నుంచి ఏడాదిపాటు టెలికాస్ట్ అయిన ‘టార్జాన్​ ది ఎపిక్​ అడ్వెంచర్స్’ టీవీ సిరీస్​ ద్వారా గ్లోబల్​ వైడ్ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను సంపాదించుకున్నారు. స్వతహాగా మార్షల్​ ఆర్ట్స్​ నిపుణుడైన​ లారా.. టార్జాన్​గా డూప్​ లేకుండా స్టంట్స్​ చేసేవారు. ఇక చాలా ఆలస్యంగా 55 ఏళ్ల వయసులో లారా..  గ్వెన్​ ష్వాంబ్లిన్​ను 2018లో వివాహం చేసుకున్నాడు. చదవండి: ఆమెతో డేటింగ్ కోసం క్యూ

మరిన్ని వార్తలు