ప్రముఖ నటుడికి సతీవియోగం

17 Jun, 2021 10:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ విలన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటుడు టార్జన్‌ అలియాస్‌ లక్ష్మీనారాయణ గుప్తా సతీమణి ఉమారాణి(52) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. ఆమె మరణం పట్ల సినీ పెద్దలు సంతాపం ప్రకటించారు. కాగా టార్జన్‌ లక్ష్మీనారాయణకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య ఉమారాణికి సంతానం లేకపోవడంతో అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. 

చదవండి: యాంకర్‌గా ఎంట్రీ.. హీరోయిన్‌గా సెటిల్‌.. ఆ తారలు ఎవరంటే..

మరిన్ని వార్తలు