Alekhya Reddy: ఇంకోసారి ఏడిస్తే.. నీకు గుడ్ బై చెప్తా: తారకరత్న కూతురు

8 Mar, 2023 21:53 IST|Sakshi

టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఆయన మరణంతో భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తారకరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. తిరుమలలో ఫ్యామిలీతో కలిసి చివరిసారిగా దిగిన ఫోటోను పంచుకున్నారు అలేఖ్యా రెడ్డి. అలాగే తారతరత్న పెద్దకర్మ సందర్భంగా భర్త రాసిన వాలెంటైన్స్ డే నోట్‌ను షేర్ చేసి ఎమోషనలయ్యారు. 

అయితే తాజాగా తారకరత్న కూతురు నిషిక రాసిన నోట్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. నిషిక రాస్తూ.. 'అమ్మా నువ్వు చాలా బాధలో ఉన్నావు. నువ్వు ఇంకోసారి ఏడిస్తే.. నేను నీకు గుడ్ బై చెప్తా' అంటూ రాసింది. తారకరత్న కూతురు నిషిక రాసిన నోట్‌ చూస్తే అమ్మపై ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. నిషిక రాసిన నోట్‌ను అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. నిన్ను చాలా మిస్సవుతున్నానంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు