విజయ్‌ ‘మాస్టర్‌’ రికార్డుల మోత

27 Nov, 2020 16:27 IST|Sakshi

చెన్నై : తమిళనాడులో దళపతి విజయ్ పేరుకు పరిచయం అక్కర్లేదు. అక్కడ ఆయనకున్న క్రేజ్‌ అలాంటిది. ఇటీవల విజయ్‌ నటించిన మాస్టర్ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన రెండు వారాలలోపే 40 మిలియన్ల వ్యూస్ సాధించింది విజయ్‌ స్టామినాను మరో సారి చూపించింది.  టీజర్‌ను ఈ నెల 14 న నిర్మాతలు విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులు, విమర్శకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ప్రసుతం నెట్టింట్లో టీజర్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతు హల్‌చల్‌ చేస్తోంది. గురువారం సాయంత్రం చిత్ర నిర్మాతలు మాస్టర్ టీజర్ వ్యూస్ తో పాటు విడుదలైన 16 గంటల్లోనే 1.6 మిలియన్లకు పైగా లైక్‌లతో యూట్యూబ్‌లో ఎక్కువ లైక్స్‌ను సొంతం చేసుకున్న టీజర్‌లలో ఒకటిగా అరుదైన రికార్డును సాధించినట్లు ప్రకటించారు.

పొంగల్‌ పండగ ముందే వచ్చింది
ఇంటర్నెట్‌లో టీజర్ హిట్ కావడంతో విజయ్‌ అభిమానులు పొంగల్‌ పండగను ముందే జరుపుకుంటున్నారు. వారు నిన్నటి నుంచి మాస్టర్ టీజర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. విజయ్‌ ఈ చిత్రంలో కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నాడు.జేవియర్ బ్రిట్టో తన సొంత బ్యానర్ ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌ గా నటించారు. మాలవికా మోహనన్, ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్ వంటి భారీ తారగణంతో చిత్రం పై  అంచానలను పెంచాయి. చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. చివరకు పొంగల్ సందర్భంగా జనవరి 14 న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఇదిలావుండగా, విజయ్ తన 65 వ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులను ప్రారంభించాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ చిత్రం ఫిబ్రవరి 2021 లో మాస్టర్ విడుదల అనంతరం సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా