తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'తీస్ మార్ ఖాన్' నిర్మాత

20 Jun, 2022 16:43 IST|Sakshi

యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

తమ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ నిర్మాత నాగం తిరుపతి రెడ్డి తన మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న ఆయన తీస్ మార్ ఖాన్ సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాలో స్టూడెంట్, రౌడీ, పోలీస్.. ఇలా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయి కుమార్ నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించనున్నారు.

చదవండి: షూలతో ఆలయంలోకి హీరో? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌
విలన్స్‌తో ఫైట్‌ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా?

మరిన్ని వార్తలు