దగ్గుబాటి అభిరామ్‌ డెబ్యూ మూవీకోసం తేజ మ్యూజిక్ సిట్టింగ్స్

8 Jul, 2021 17:42 IST|Sakshi

టాలీవుడ్‌ ప్రమముఖ నిర్మాత డి. సురేశ్‌ బాబు తనయుడు, రానా దగ్గుబాటి సోదరుడు దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్‌ పతాకంపై ‘జెమిని’ కిరణ్‌ నిర్మించనున్నారు. ఈ మూవీ షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొద‌ల‌య్యాయి. దర్శకుడు తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్, గేయ రచయిత చంద్రబోస్ ఈ చిత్రానికి ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. 

ఆర్‌.పి.పట్నాయక్‌-తేజ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. మ‌న‌సుకు హ‌త్తుకునే సాహిత్యానికి ప్ర‌సిద్ది చెందిన స్టార్ లిరిసిస్ట్ చంద్ర‌బోస్ ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. ఈ ముగ్గురి క‌ల‌యిక‌లో అభిరామ్ ఫ‌స్ట్ మూవీ త‌ప్ప‌కుండా మ్యూజిక‌ల్ బొనాంజ‌గా ఉండ‌బోతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు