తేజకు నో చెప్పిన కాజల్‌.. తాప్సీ ఓకే

5 Jan, 2021 17:33 IST|Sakshi

ఇండస్ట్రీకి పరిచయమై పుష్కర కాలం పూర్తయినా కూడా ఇప్పటికీ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది కాజల్‌ అగర్వాల్‌. ఇటీవల పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్‌ ముద్దుగుమ్మ కాజల్‌ వైవాహిక బంధాన్ని, సినీ కెరీర్‌ను బాగానే మేనేజ్‌ చేస్తోంది. ఒకవైపు సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటూనే మ‌రోవైపు భర్త గౌతమ్‌ కిచ్లుకు తగినంత స‌మ‌యాన్ని కేటాయిస్తోంది. ఈ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా భర్తతో క‌లిసి ప‌లు దేశాల్లో విహరించిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే.. కాజల్‌ ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇవే కాకుండా కాజల్‌ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. కమల్‌ హాసన్‌ ఇండియన్‌-2లో కూడా నటిస్తోంది. అంతేగాక భర్త గౌతమ్‌తో కలిసి కుషన్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు ఈ భామ. ఇదిలా ఉండగా డైరెక్టర్‌ తేజ తెరకెక్కించనున్న ‘అలివేలు వెంకటరమణ’ సినిమాలో నటించేందుకు కాజల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కాజల్‌ వైదొలిగినట్లు వార్తలు వినిపిస్తన్నాయి. కొన్ని కారణాల వల్ల కాజల్‌ తప్పుకోగా ఆమె స్టానంలో సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్నును తీసుకున్నట్లు వినికిడి. కాగా కాజల్‌, తేజ కాంబినేషన్‌లో ఇప్పటికే  లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రితో పాటు సీతా సినిమాలు వచ్చాయి. 

మరిన్ని వార్తలు