HanuMan Release Date: తేజ సజ్జా హనుమాన్‌ రిలీజయ్యేది ఆరోజే!

9 Jan, 2023 16:54 IST|Sakshi

తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హనుమాన్‌. ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అమృతా అయ్యర్‌ కథానాయిక. చైతన్య సమర్పణలో కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. ఈ సినిమా మే 12న తెలుగు, హిందీ, మరాఠి, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో విడుదల కానున్నట్లు ప్రకటించారు.

భారత్‌తో పాటు అమెరికా, చైనా, జపాన్‌, యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్‌, ఆస్ట్రేలియా, జెర్మనీ, శ్రీలంక, మలేషియా దేశాల్లో రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్‌ చేశారు. హనుమంతుడి అనుగ్రహంతో ఓ కుర్రాడికి సూపర్‌ పవర్‌ వస్తే ఏం చేస్తాడనేదే సినిమా కథ. ఇందులో వరలక్ష్మి శరత్‌ కుమార్‌, వెన్నెల కిషోర్‌, సత్య, గెటప్‌ శ్రీను ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే రిలీజైన హనుమాన్‌ టీజర్‌లో వీఎఫ్‌ఎక్స్‌ హాలీవుడ్‌ స్టాండర్స్‌ను తలదన్నేలా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

చదవండి: 

మరిన్ని వార్తలు