Tejasswi Prakash - Karan Kundrra: పబ్లిక్‌గా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల లిప్‌లాక్‌! వీడియో వైరల్‌..

1 Aug, 2022 17:27 IST|Sakshi

బిగ్‌బాస్‌ షోలో ఆటపాటలే కాదు ప్రేమపాటలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని జంటలు బాగా ఫేమస్‌ అయ్యాయి. హిందీలో అయితే దివంగత నటుడు సిద్దార్థ్‌ శుక్లా- షెహనాజ్‌(సిద్‌నాజ్‌) జంట, కరణ్‌ కుంద్రా - తేజస్వి ప్రకాశ్‌(తేజ్‌రాణ్‌) జంటలు బాగా పాపులర్‌ అయ్యాయి. తేజ్‌రాణ్‌ చేసే హడావుడి చూసి ముచ్చటపడిపోతుంటారు అభిమానులు. తాజాగా వీళ్లిద్దరూ పబ్లిక్‌లో ముద్దులాట ఆడారు. ఆదివారం బాలీవుడ్‌ నిర్మాత వెనెస్సా వాలియా బర్త్‌డే పార్టీకి హాజరైన ఈ ప్రేమపక్షులు కెమరాలేవీ తమను చూడటం లేదనుకున్నారో ఏమోకానీ ముద్దుల్లో మునిగిపోయారు.

అయితే చివర్లో ఇదంతా వీడియో తీస్తున్నారని అర్థమవగానే దయచేసి పోస్ట్‌ చేయొద్దని కోరింది 'నాగిని' బ్యూటీ. కానీ ఆమె ప్రియుడు కరణ్‌ కుంద్రా మాత్రం ప్లీజ్‌ పోస్ట్‌ చేయండని కోరడటం గమనార్హం. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా తేజ్‌రాణ్‌ జంట ఎప్పుడూ ఇలాగే ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. కొందరు మాత్రం మీ చుట్టూ జనం ఉన్నా కూడా పట్టించుకోరా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

A post shared by Nikki G (@nikkigupta092021)

చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్‌ ఖాన్‌ ఆవేదన
 థియేటర్‌లో రెండే, ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు రిలీజ్‌కు రెడీ

మరిన్ని వార్తలు