కేసీఆర్ బయోపిక్‌ తెలంగాణ దేవుడు

20 Apr, 2021 05:56 IST|Sakshi

‘‘ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్‌ బయోపిక్‌కు ‘తెలంగాణ దేవుడు’ పేరు కరెక్ట్‌గా సరిపోయింది. తెలంగాణ ఉద్యమం గురించి తెలియజేసే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర హోమ్‌మంత్రి మెహమూద్‌ అలీ అన్నారు. శ్రీకాంత్‌ టైటిల్‌ పాత్రలో జిషాన్‌ ఉస్మాన్, సంగీత, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’.

వడత్య హరీష్‌ దర్శకత్వంలో మహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజవుతోంది.‘‘గతంలో సినీ ఇండస్ట్రీ కొందరి చేతుల్లోనే ఉండేది. వాళ్లు తీస్తేనే థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యి సినిమాలు ఆడాలనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మారుతోంది. ఇంకా మార్పు తెస్తాం’’ అన్నారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. ‘‘ఈ బయోపిక్‌ తీయడం మా అదృష్టం’’ అన్నారు నిర్మాత జాకీర్, దర్శకుడు హరీష్‌. ‘‘కేసీఆర్‌ గారి పాత్ర చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు హీరో శ్రీకాంత్‌.

చదవండి: డాషింగ్‌ డైరెక్టర్‌తో నితిన్ సినిమా, హీరోయిన్‌గా ‘ఉప్పెన’ బ్యూటీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు