Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

10 May, 2022 09:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి 18వరకు ఈ పెంపు వర్తిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా స్పష్టం చేశారు.

(చదవండి: సితార చాలా పెద్ద హీరోయిన్‌ అవుతుంది : మహేశ్‌ బాబు)

అదేవిధంగా ఈ ఏడు రోజులు రోజూ ఐదు షోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. టికెట్‌ రేట్ల విషయానికొస్తే మల్టిప్లెక్స్, రిక్లైనర్, లార్జ్‌ స్క్రీన్‌ ఐమ్యాక్స్‌ వంటి థియేటర్లలో టికెట్‌పై రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందుకు అనుమతించినట్టు తెలిపారు. మిగిలిన నాన్‌ ఏసీ థియేటర్లలో ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు