సోనూసూద్‌ను కలిసిన సాంబయ్య

2 Aug, 2021 02:21 IST|Sakshi

సాక్షి, మణుగూరుటౌన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామానికి చెందిన పడిదల సాంబయ్య అనే యువకుడు ఆదివారం ముంబైలో ప్రముఖ నటుడు సోనూసూద్‌ను కలిశాడు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడైన సాంబయ్య ఎలాగైనా సోనూను కలవాలనుకున్నారు. దీంతో గత నెల 17న కాలినడకన ముంబైకి బయలుదేరాడు. దాదాపు 1,050 కిలోమీటర్లు నడిచి ముంబైలోని ఫిలింటవర్‌ వద్ద సోనూసూద్‌ను కలిసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సోనూను కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సాంబయ్య ‘సాక్షి’తో చెప్పాడు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు