హైలెస్సో హైలెస్సా... 

23 Sep, 2023 01:04 IST|Sakshi
నవమి, ఆనంద్‌

‘‘ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా చేసిన ఆనంద్‌ వర్ధన్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిదురించు జహాపన’. ప్రసన్న కుమార్‌ దేవరపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్లు. సామ్‌ .జి, వంశీకృష్ణ వర్మ నిర్మిస్తున్నారు.

అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘హైలెస్సో హైలెస్సా...’ అంటూ సాగే పాటని తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విడుదల చేశారు. డి. ప్రసన్న కుమార్‌ సాహిత్యం అందించిన ఈ పాటను ధనుంజయ్‌ సీపాన, ఎ. ప్రవస్తి పాడారు. ‘‘అందమైన ప్రేమకథని తెలియజేసే లవ్లీ మెలోడీగా ఈ పాటని స్వరపరిచారు అనూప్‌’’ అన్నారు మేకర్స్‌.

మరిన్ని వార్తలు