ఆకట్టుకుంటున్న ‘తెలవారెనే సామి ... తెలవారెనేమో నా సామి’ సాంగ్‌

20 Sep, 2022 11:57 IST|Sakshi

త్రిగుణ్, మేఘా ఆకాష్‌ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్‌ సిద్ధమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. శిరీష సిద్ధమ్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తెలవారెనే సామి ... తెలవారెనేమో నా సామి’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ‘‘ప్రేమదేశం’ సినిమాని నా చిన్నప్పుడు చూశాను.

ఇదే టైటిల్‌తో వస్తున్న మా సినిమాను టీమ్‌ సహకారంతో పూర్తి చేశాను’’ అన్నారు శ్రీకాంత్‌ సిద్ధమ్‌. ‘‘ఈ సినిమా నా కాలేజ్‌ డేస్‌ను గుర్తు చేసింది’’ అన్నారు త్రిగుణ్‌. ‘‘అక్టోబర్‌లో వస్తున్న మా చిత్రం హిట్టవుతుంది’’ అన్నారు మేఘా ఆకాష్‌ ఈ చిత్రానికి కెమెరా: సజాద్‌ కాక్కు, సహనిర్మాత: భరత్, అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: రఘు కల్యాణ్‌.

మరిన్ని వార్తలు