టీవీ నటి హీనా ఖాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

21 Apr, 2021 08:55 IST|Sakshi

ముంబై : ప్రముఖ టెలివిజన్‌ నటి హీనా ఖాన్ ‌కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హీనా ఖాన్‌ తండ్రి గుండెపోటుతో ఏప్రిల్‌ 20న కన్నుమూశారు.  తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే కశ్మీర్‌లో జరుగుతున్న షూటింగ్‌ను రద్దు చేసుకున్న హీనా ఖాన్‌ వెంటనే హుటాహుటిన ముంబైకు చేరుకుంది. హీనాఖాన్‌ తండ్రి మరణంపై పలువురు సన్నిహితులు, స్నేహితులు ఆమె కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. 

ఇక ‘యే రిష్‌తా క్యా కెహ్లాతా హై’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీనా ఖాన్‌. తొలి సీరియల్‌తోనే హీనా ఖాన్‌కు స్టార్‌ ఇమేజ్‌ దక్కింది. ఈ సీరియల్‌లో అక్షర పాత్రతో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ షోతో మరింత ప్రచారం పొందారు‌. బిగ్‌బాస్‌11 సీజన్‌లో పాల్గొని రన్నరప్‌ నిలిచి సత్తా చాటారు. ఇక హీనా ఖాన్‌ నటించిన తొలి చిత్రం లైన్స్‌..కేన్స్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 

చదవండి : ‘ముద్దు సీన్‌ గురించి అమ్మతో చర్చించాకే..’
‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు