అప్పుడు వాంఛలు తీర్చుకుని ఇప్పుడు మొహం చాటేసిన నటుడు

12 Jul, 2021 11:30 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: ప్రేమ పేరుతో సినీ నటిని మోసగించిన నటుడిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉయ్యాలవాడ మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన మాలపాటి రామకృష్ణ యూసుఫ్‌గూడ సమీపంలోని రహమత్‌నగర్‌లో అద్దెకుంటూ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన యువతి అదే సినిమాలో నటిస్తూ నల్లకుంటలోని తన సోదరి వద్ద ఉంటుంది. నటిస్తున్న సమయంలో ఇద్దరి మద్య ప్రేమ చిగురించింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను పలు మార్లు తన గదిలోకి తీసుకెళ్లి శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చగా అబార్షన్‌ చేయించడంతో పాటు ఇటీవల ఆమె కొట్టడం ప్రారంభించారు. మూడు రోజుల క్రితం ఆమె ఉంటున్న నల్లకుంటకు వెళ్లి అసభ్యకరంగా తిట్టడంతో పాటు జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చి కొట్టాడు. నిన్ను పెళ్లి చేసుకోను అంటూ వెళ్లి పోయాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు తనకు న్యాయం చేసి రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆదివారం ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు రామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు