ఆన్‌లైన్‌లో సంగీత పోటీలు

22 Aug, 2020 01:29 IST|Sakshi
కౌశిక్, అనూప్‌ రూబెన్స్‌

తెలుగు గాయకుల ప్రతిభను వెలికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ‘తెలుగు డిజిటల్‌ ఐడల్‌’ తొలిసారి సంగీత పోటీలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా గాయనీ గాయకులకు తెలుగు పాటకు పట్టంకట్టే విధానంలో శాస్త్రీయ, సినీ, లలిత సంగీత విభాగాల్లో ఈ పోటీ జరగనుంది. ఇందుకు సంబంధించిన లోగోను సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ ఆవిష్కరించారు. ‘‘అంతర్జాతీయంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేవలం ఆన్‌లైన్‌లోనే మాత్రమే వీక్షించగలరు. ఇందులో పాల్గొనే గాయనీ గాయకుల వయో పరిమితి కనీసం 16 సంవత్సరాలు.

మొదటి రౌండులో ఎంపికైన వారికి ఈ మెయిల్‌ ద్వారా తెలియజేస్తాం. ఈ నెల 31 రాత్రి 11 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంది.  అభ్యర్థులు తాము పాడిన శాస్త్రీయ, సినీ, లలిత గీతాల తాలూకు వీడియో నిడివి 2 నిమిషాలకు మించకూడదు. ఈ పోటీల్లో పాల్గొనే ఔత్సాహిక గాయనీ గాయకులు తమ పేర్లను www.telugudigitalidol.com వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి’’ అని నిర్వాహకులు కోరారు.

మరిన్ని వార్తలు