తండ్రి అయిన తెలుగు ద‌ర్శ‌కుడు

13 Sep, 2020 20:35 IST|Sakshi

తెలుగు ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య తండ్ర‌య్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఆదివారం వెల్ల‌డించారు. నేడు ఉద‌యం 10.55 గంట‌ల‌కు బాబు జ‌న్మించాడ‌ని చెప్పుకొచ్చారు. శ్రీరామ్ హీరో సుధీర్‌బాబు న‌టించిన "భ‌లే మంచి రోజు" చిత్రంతో వెండితెర‌పై ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. తొలిచిత్రంతోనే విజ‌యాన్ని న‌మోదు చేసుకుని త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న "శ‌మంత‌క‌మ‌ణి" చిత్రాన్ని తీశారు. (చ‌ద‌వండి: లక్ష్మీభాయ్‌ పాత్ర చేస్తే లక్ష్మీభాయ్‌ అయిపోతారా?)

అనంత‌రం స్టార్ హీరోల‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం సంపాదించుకున్నారు. అలా కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నానిల క‌ల‌యిక‌లో "దేవ‌దాస్" చిత్రాన్ని రూపొందించారు. కానీ ఇది అనుకున్నంత హిట్ అవ‌క‌పోగా ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. దాంతో సంవ‌త్స‌రం గ్యాప్ తీసుకున్న ఆయ‌న గ‌తేడాది చివ‌రి నుంచి అశోక్ గ‌ల్లా (గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు)ను హీరోగా ప‌రిచ‌యం చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, న‌టుడు జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. (చ‌ద‌వండి: బాలీవుడ్ న‌టుడికి పుత్రికోత్సాహం)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు