పెళ్లిలో చిరు నవ్వులు చిందిస్తున్న ఈ స్టార్‌ డైరెక్టర్‌ని గుర్తు పట్టారా?

13 Jun, 2021 13:53 IST|Sakshi

పై ఫోటోలో పెళ్లి కూతురు పక్కన కూర్చొని చిరు నవ్వులు చిందిస్తున్న టాలీవుడ్‌ సెలబ్రిటీని గుర్తుపట్టారా? అబ్బే.. చాలా కష్టమండి అంటారా? సరే అయితే మీ మీకోసం ఒక క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. టాలీవుడ్‌లో ఆయనో స్టార్‌ డైరెక్టర్‌. మాటల మాంత్రికుడు. తేలికైన పదాలతో, చాలా అర్థవంతమైన సంభాషణలు చెప్పడం ఆయన స్పెషాలిటీ. గుర్తొచ్చిందా? డౌట్‌ పడకండి.. మీరనుకున్నట్లుగా ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే.  ఈ ఫోటోలో త్రివిక్రమ్ కొంచెం బొద్దుగా ఉండటంతో వెంటనే గుర్తు పట్టడం కష్టమే. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ మీకు త్రివిక్రమ్ పెళ్లి స్టోరీ తెలుసా? ఆయన పెళ్లి కూడా సినిమా మాదిరే జరిగింది. అక్కని చూడడానికి వెళ్లి చెల్లిని పెళ్లి చేసుకొని వచ్చాడు మన మాటల మాంత్రికుడు.  ప్రముఖ గేయరచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి సోదరుడి కూతురే సౌజన్య. మొదట సౌజన్య అక్కని చూడడానికి వెళ్లాడట త్రివిక్రమ్‌. అయితే అక్కడ అక్క పక్కన ఉన్న సౌజన్యని చూసి తొలి చూపుకే ప్రేమలో పడిపోయాడట. 

వెంటనే తన మనసులోని మాటను సౌజన్య తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా ఇందుకు ఒప్పుకున్నారట. అయితే సౌజన్య అక్క పెళ్లి అయిన తరువాత మీ పెళ్లి చేస్తామని వారి తల్లిదండ్రులు కండిషన్ పెట్టారట. దీనికి త్రివిక్రమ్ ఒప్పుకొని ఆమె పెళ్లయిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ మహేశ్‌బాబుతో ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వీరిద్ధరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ సాధించగా.. రాబోయే సినిమాపై ఇప్పటి నుంచే అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.
చదవండి:
మీనాక్షి చౌదరి గురించి ఈ విషయాలు తెలుసా?
మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు