ప్రముఖ సినీ గీత రచయిత ప్రేమ పెళ్లి

23 Nov, 2020 15:55 IST|Sakshi

ఫరా.. నా జీవితంలోకి వెలకమ్‌

ఈ మూమెంట్‌ కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నా

మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు: శ్రీమణి

ప్రముఖ సినీ గీత రచయిత శ్రీమణి ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పదేళ్లు ప్రేమించిన ప్రేయసి ఫరాను ఆదివారం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు పెట్టాడు. ‘ఫరాతో పెళ్లి కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నాను. చివరకి కల నిజమైంది. ప్రియమైన ఫరా.. నా జీవితంలోకి వెలకమ్‌. మా ప్రేమను అర్థం చేసుకొని మమ్మల్ని ఒకటి చేసినందుకు మా తల్లిదండ్రులకు, దేవునికి కృతజ్ఞతలు. వివాహ జీవితం ప్రారంభం’ అంటూ ట్వీట్‌ చేశారు. చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!

కాగా కరోనా మహమ్మారి కాలంలో అనేకమంది టాలీవుడ్‌ ప్రముఖులు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి, నిఖిల్‌, నితిన్‌తోపాటుగా కాజల్‌ అగర్వాల్‌ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ లిస్ట్‌లో శ్రీమణి కూడా చేరిపోయారు. దీంతో శ్రీమణికి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్ స్పందించారు ‘‘మీ రొమాంటిక్ లిరిక్స్ వెనుకున్న రహస్యం ఏంటో ఇప్పుడు అర్థమైందంటూ ట్వీట్ చేశాడు. ‘ఇష్క్‌ సిఫాయా’ అని పాడి.. ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్‌ చేసి.. ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లి చేసుకున్నారన్నమాట అని ట్వీట్‌ చేశారు. చదవండి: వివాహం చేసుకున్న బాలీవుడ్‌ నటి

ఇక తన పాటలతో సంగీత ప్రేమికులను అలరించిన వ్యక్తిగా శ్రీమణికి మంచి పేరు ఉంది. 100% లవ్‌ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీమణి.. ఆ తరువాత జులాయిలో చక్కని బైక్‌ ఉంది, మీ ఇంటికి ముందో గేటు, అత్తారింటికి దారేదిలో ఆరడగుల బుల్లెట్టు, గీతా గోవిందం సినిమాలోని వచ్చిందమ్మా వచ్చిందమ్మా, ఎఫ్‌ 2లో ఎంతో ఫన్‌, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమాలో జారుకో.. జారుకో వంటి అద్భుతమైన పాటలను రాశారు. అంతేగాక  ఉప్పెన సినిమాలో ‘నీకళ్లు నీలి సముద్రం’ అంటూ ఆయన రాసిన పాట రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. చదవండి: అప్పుడే నా పెళ్లి.. లేదంటే..!: త్రిష

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా