Ramakrishna Reddy: ప్రముఖ నిర్మాత కన్నుమూత

26 May, 2022 09:37 IST|Sakshi

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి(76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాగా రామకృష్ణారెడ్డి 1948 మార్చి 8న నెల్లూరు జిల్లాలోని గూడూరులో జన్మించారు. శ్రీమతి మస్తానమ్మ, ఎం.సుబ్బరామిరెడ్డి వారి తల్లిదండ్రులు. చదువు పూర్తయ్యాక కొంతకాలం సిమెంట్‌ రేకుల వ్యాపారాన్ని చూసుకున్న ఆయన తన బంధువు ఎంఎస్‌ రెడ్డి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అలా.. వైకుంఠపాళి, అల్లుడుగారు జిందాబాద్‌, గడుసు పిల్లోడు, మా ఊరి దేవత,  అభిమానవంతులు, మూడిళ్ల ముచ్చట, సీతాపతి, అగ్ని కెరటాలు, మాయగాడు వంటి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అమ్మోరు తల్లి చిత్రాన్ని తెలుగులో డబ్‌ చేశారు.

చదవండి 👇
గ్రాండ్‌గా కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ ఎంగేజ్‌మెంట్‌
కిచ్చా సుదీప్‌, జాక్వెలిన్‌ల 'రారా రక్కమ్మా..' సాంగ్‌ విన్నారా?

మరిన్ని వార్తలు