The Ten Commandments Movie:రీమేక్‌గా హాలీవుడ్‌ క్లాసిక్‌ చిత్రం.. విడుదల ఎప్పుడంటే ?

28 Dec, 2021 18:54 IST|Sakshi

The Ten Commandments Movie Released on December 31: ప్రపంచ సినీ చరిత్రలో ది టెన్‌ కమాండ్‌మెంట్స్‌ చిత్రానిది ప్రత్యేక స్థానం (క్లాసిక్‌ చిత్రం). 1956లో విడుదలై ఈ చిత్రం ఒక విజువ‌ల్ వండ‌ర్. సెసిల్ బి డెమిల్లే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత‍్రం నిడివి 220 నిమిషాలు. ఈ చిత్రం అప్పుడు ఇండియాలోని ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌. బెంగళూరు, చైన్నై వం​టి నగరాల్లో 50 వారాలకు పైగా ప్రదర్శితమైంది. సుమారు 65 సంవత్సరాల తర్వాత ఈ చిత్రాన్ని అదే పేరుతో రీమెక్‌ చేయనున్నారు. 

ఈ  చిత్రంలో మిషన్‌ ఇంపాజిబుల్ 2, బాట్‌ ఉమెన్‌ సినిమాలతో గుర్తింపు పొందిన డౌగ్రే స్కాట్‌ ఇందులో మోసెస్‌ పాత్రలో నటించారు. ఇంకా ఇందులో ఆరోన్‌గా లినస్‌ రోచ్‌, మెనెరిత్‌గా నవీన్‌ ఆండ్రూస్‌, జిప్పోరాగా మియా మాస్ట్రో, రామ్‌ సెస్‌గా పాల్‌ రైస్‌, ఆనందర్‌గా రిచర్డ్‌ ఓబ్రెయిన్‌ యాక్ట్ చేశారు. రాబర్ట్‌ డోర్న్‌ హెల్మ్‌, జెఫ్రీ మడేజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇంగ్లీష్‌, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని వార్తలు