వేసవిలో మ్యాచ్‌ను ప్లాన్‌ చేసుకున్న నయనతార

2 Feb, 2024 05:39 IST|Sakshi

‘ది టెస్ట్‌’ను పూర్తి చేశారు నయనతార. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్‌ లీడ్‌ రోల్స్‌ చేశారు. మీరా జాస్మిన్‌ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సింగర్‌ శక్తి శ్రీగోపాలన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.  ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు, ఈ వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. కాగా ఈ సినిమాను గత ఏడాది నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి వాయిదా వేశారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. 
 

whatsapp channel

మరిన్ని వార్తలు