నంది అవార్డు ప్రతి ఆర్టిస్ట్‌ కల

23 May, 2023 02:09 IST|Sakshi
ప్రతాని రామకృష్ణ గౌడ్, అలీ

– అలీ

‘‘1964 నుండి నంది అవార్డ్స్‌ ఇస్తున్నారు. ఆ అవార్డు అందుకోవాలనేది ప్రతి ఆర్టిస్ట్‌ కల. 7 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్‌గారికి థ్యాంక్స్‌. అలాగే సీనియర్‌ నటుల పేరుతో స్మారక అవార్డ్స్‌ ఇవ్వడం హర్షించదగ్గ విషయం’’ అని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు, నటుడు అలీ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వర్యంలో ఆగస్టు 12న దుబాయ్‌లో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్‌ సౌత్‌ ఇండియా 2023’ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ అవార్డ్స్‌ ఇన్విటేషన్‌ బ్రోచర్‌ను అలీ, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ విడుదల చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘దాదాపు ఆరేడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో నంది అవార్డ్స్‌ పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వేడుకకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు