ఆగస్టులో టీఎఫ్‌సీసీ నంది అవార్డులు

16 May, 2023 03:57 IST|Sakshi
సుమన్, మురళీ మోహన్, రామకృష్ణ గౌడ్, ప్రసన్నకుమార్, బి. గోపాల్‌

తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్‌ సౌత్‌ ఇండియా 2023’ వేడుక జరగనుంది. దుబాయ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్లో ఆగస్టు 12న ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జ్యూరీ సభ్యులను సెలెక్ట్‌ చేసుకున్న సందర్బంగా సోమవారం పాత్రికేయుల సమావేశంలో టీఎఫ్‌సీసీ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘2021, 22 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాల వారు ఈ అవార్డుల కోసం టీఎఫ్‌సీసీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందుకు చివరి తేదీ జూన్‌ 15. తెలంగాణ ప్రభుత్వం నుండి నంది అవార్డ్స్‌కి సంబంధించిన లెటర్‌ పై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ గారు సంతకం చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర ప్రభుత్వం సహకారం కూడా కోరనున్నాం.

ఆగస్టు 12న దుబాయ్‌ ప్రిన్స్‌ చేతుల మీదుగా నంది అవార్డులు ఇవ్వనున్నాం’’ అన్నారు. ‘‘జ్యూరీ కమిటీకి నన్ను చైర్మన్‌గా ఉండమన్నారు. కానీ నేను జ్యూరీ మెంబర్‌గా ఉంటూ సపోర్ట్‌ చేస్తానని చెప్పాను. తెలంగాణ ప్రభుత్వ సహకారం తీసుకున్నట్లే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నారు మురళీ మోహన్‌. సుమన్, బి. గోపాల్‌ తదితరులు మాట్లాడారు.

మరిన్ని వార్తలు