నటి హీరాకు అజిత్‌ ప్రేమలేఖలు!

20 Nov, 2020 14:38 IST|Sakshi

చెన్నై: నటుడు అజిత్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఆయనకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. రీసెంట్‌గా అజిత్‌కు సంబంధించిన ఓ విషయం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1990లో నటి హీరా రాజ్‌గోపాల్‌తో అజిత్‌ నడపిన ప్రేమాయణం అప్పట్లో టాక్‌ ఆప్‌ ది టౌన్‌గా ఉండేది. అయితే ఆ సమయంలో హీరాకు అజిత్‌ ప్రేమలేఖలు రాసేవారట. ఈ విషయాన్ని నటి బాయిల్వాన్‌ రంగనాథన్‌ వెల్లడించారు. ఆ లెటర్స్‌లో ఒకదాన్ని తాను చదివానని పేర్కొనడంతో వీరి లవ్‌స్టోరి మరోసారి వార్తల్లో నిలిచింది. (అందుకు నేను బాధ్యున్ని కాను!)

కాథల్ కొట్టై అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించిన అజిత్‌ - హీరా షూటింగ్ సమయంలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత 'తోడారమ్' అనే మరో చిత్రంలోనూ కలిసి నటించారు. అయితే వీరి ప్రేమ బంధం పెళ్లిదాకా మాత్రం వెళ్లలేదు. వీరి వివాహానికి హీరా తల్లి నో చెప్పిందని, దీంతో వీరి లవ్‌ స్టోరికి ఫుల్‌స్టాప్‌ పడినట్లు కోలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. కాగా కొన్నేళ్లకు అజిత్‌ నటి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అనోష్కా, ఆద్విక్‌ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నటిగా కెరియర్‌లో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్న షాలిని ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. గృహిణిగా, నటిగా రెండు బాధ్యతలను తాను నిర్వహించలేనని అందుకే తన మొదటి ప్రయారిటీ కుటుంబమే అని  షాలిని  ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. (అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు