క్రేజీ కాంబో: రజనీకాంత్‌తో లోకేశ్ కనగరాజ్‌ భారీ ప్రాజెక్ట్‌!

6 Apr, 2023 09:06 IST|Sakshi

ఏడుపదుల వయసులోనూ రజనీకాంత్‌ జోరుగా హుషారుగా సినిమాల మీద సినిమాలు కమిట్‌ అవుతూ, బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ‘జైలర్‌’ చిత్రంలో హీరోగా, ‘లాల్‌సలామ్‌’ చిత్రంలో అతిథి పాత్ర చేస్తున్నారాయన. ఇవి కాకుండా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించనున్న చిత్రం అంగీకరించారు.

తాజాగా మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఇటీవల రజనీకాంత్‌ను కలిసి ఓ కథ వినిపించారని, ఈ స్క్రిప్ట్‌ రజనీకాంత్‌కి నచ్చిందని టాక్‌. ఈ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందంటోంది చెన్నై సినిమా సర్కిల్‌. ఈ చిత్రాన్ని కమల్‌హాసన్‌ నిర్మించనున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు