'తలైవి' రిలీజ్‌కు కరోనా షాక్‌

9 Apr, 2021 20:21 IST|Sakshi

వంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం తలైవి. కంగనా టైటిల్‌ పాత్రలో కనిపించనుంది. ఇందులో ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌ స్వామి, ఎంజీఆర్‌ సతీమణి జానకీ రామచంద్రన్‌ పాత్రలో మధుబాల నటించారు. ఏఎల్‌ విజయ్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌ 23న థియేటర్లలో సందడి చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ తాజాగా తలైవి రిలీజ్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్‌.

'ఏప్రిల్‌ 23న అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ కరోనా వ్యాప్తి హెచ్చుమీరుతున్న తరుణంలో ఈ నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం.  ప్రభుత్వ నిబంధనలకు మద్దతు తెలుపుతూ తలైవిని వాయిదా వేస్తున్నాం' అని శుక్రవారం ప్రకటన జారీ చేసింది. కొత్త డేట్‌ను మాత్రం ప్రకటించలేదు.

చదవండి: కంగనాకి అక్షయ్‌ కుమార్‌ సీక్రెట్‌ కాల్‌!

సెకండ్‌ వేవ్ సినిమా‌.. మూడు నెలల ముచ్చటేనా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు