దళపతికి ఇన్నాళ్లకు తీరిందా..?

28 Feb, 2022 00:55 IST|Sakshi

గత ఏడాది అక్టోబర్ 29న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 46ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించి అభిమానులతో పాటు యావత్‌ సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు పునీత్‌. ముఖ్యంగా కన్నడిగులు అయితే తమను తన నటనతో ఇంతకాలం అలరించిన పవర్ స్టార్ ఒక్కసారిగా మరణించడంతో షాక్‌కు గురయ్యారు. చాలా రోజుల వరకు పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. నేటికీ పునీత్‌ సమాధిని తన అభిమానులు దర్శించుకుంటూనే ఉన్నారు. 

పునీత్ మృతి చెందిన సమయంలో యావత్ భారత సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి చెందిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో చివరి చూపు కోసం అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కూడా బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కన్నీళ్లు పెట్టుకుని మరీ పునీత్ అంతిమ సంస్కారాలను నిర్వహించిన సంగతి ప్రతి ఒక్కరికీ తెల్సిందే.

అయితే తాజా విషయం ఏంటంటే.. పునీత్ సమాధిని తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ ఘాట్‌ను సందర్శించి శ్రద్దాంజలి ఘటించాడు. అయితే దీనిపై సోషల్ మీడియాలో విజయ్ యాంటీ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

పునీత్ చనిపోయిన ఇన్నాళ్లకు విజయ్‌కి సమయం దొరికిందా..? అంటూ కన్నడ మీడియా వర్గాలతో పాటు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చనిపోయి ఇంతకాలం గడుస్తున్నా ఇప్పటి దాకా తనకు తీరిక దొరక లేదా అంటూ విమర్శిస్తున్నారు. విజయ్ నిజంగానే అంత బిజీగా ఉన్నాడా ఇప్పటికి కానీ ఆయనకు కుదర్లేదా అంటూ నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. 

ఇప్పుడు కూడా ఏదో పని మీద బెంగళూరుకు వచ్చిన విజయ్ పనిలో పనిగా పునీత్ ఘాట్‌ను సందర్శించేందుకు వచ్చాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనికి కౌంటర్‌గా విజయ్ అభిమానులు తమ అభిమాన హీరోపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా విజయ్ పర్యటన వివాదాస్పదం అవ్వడం ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు