దళపతి విజయ్‌ లవ్‌ స్టోరీ గురించి తెలుసా!

22 Jun, 2021 17:34 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ నేటితో 47వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. మంగళవారం(జూన్‌ 22) విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా కోలీవుడ్‌ నటీనటులు, సినీ ప్రముఖులతో పాటు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సైతం విజయ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ హీరోగా విజయ్‌ తన తండ్రి, ప్రముఖ డైరెక్టర్‌ ఎస్‌ఏ చంద్రశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన నాలయై తీర్పు అనే యూక్షన్‌ మూవీతో హీరోగా తెరంగేట్రం చేశాడు. అయితే అంతకుముందే విజయ్‌ తండ్రి డైరెక్షన్‌లో బాలనటుడిగా కూడా పలు చిత్రాల్లో నటించాడు. ఇక తన తొలి చిత్రంతోనే యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక వరసగా సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో ఆయన భార్య సంగీతను 1999లో వివాహం చేసుకుని సెటిలైయిపోయాడు. అయితే విజయ్‌-సంగీతలది ప్రేమ వివాహం. విజయ్‌ అభిమాని అయిన సంగీత విజయ్‌కు మొదట తన ప్రేమను వ్యక్తం చేసిందట. ఆ తర్వాత ఇద్దరూ కొంతకాలం ప్రేమించుకుని ఇంట్లో ఒప్పించి మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేని సంగీత, విజయ్‌లకు పరిచయం ఎలా ఎర్పడిందో ఒకసారి తెలుసుకుందాం. అయితే పెళ్లికి ముందు విజయ్‌ భార్య సంగీత యూకేలో నివసిస్తుండేదట. చెన్నైకి చెందిన ఆమె విజయ్‌కు వీరాభిమాని. ఈ క్రమంలో ఓ సారి షూటింగ్‌ నేపథ్యంలో యూకేకు వెళ్లిన విజయ్‌ని సంగీత అక్కడ కలుసుకుంది.

విజయ్‌ మూవీ షూటింగ్‌ జరుగుతున్న సెట్‌కు వెళ్లి తన అభిమానిని అంటూ సంగీత పరిచయం చేసుకుంది. అలా కాసేపు సెట్‌లో ముచ్చటించుకున్న వీరిద్దరూ ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటుండగా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. ఈ క్రమంలో సంగీత మొదట తన ప్రేమను వ్యక్తం చేయడంతో విజయ్‌ కూడా ఓకే చెప్పేశాడు. అలా కొంతకాలం పాటు వీరిద్దరూ ప్రేమించుకుని ఇదే విషయం ఇంట్లో చెప్పేశారు. వారి పెద్దవాళ్లు కూడా వీరి ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో 1999లో సింగీతను విజయ్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి కొడుకు జాన్సన్‌ సంజయ్‌, కూతురు దివ్య సహాసలు ఉన్నారు. త్వరలో విజయ్‌ కుమారుడు సంజయ్‌ హీరోగా అరంగేట్రానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు