హీరో విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు

16 Nov, 2021 08:18 IST|Sakshi

Thalapathy Vijay Gets Bomb Threat Call At His Residence: నటుడు విజయ్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెన్నై నగర పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో శనివారం అర్ధరాత్రి నీలాంగరైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. నీలాంగరై పోలీసులు బాంబు స్క్వాడ్‌ కలిసి తనిఖీ చేశారు. బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

విచారణలో విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి  చెందిన భువనేశ్వర్‌ అనే మనస్థిమితంలేని యువకుడు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. అతను గతంలో కూడా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లల్లో బాంబు ఉన్నట్లు ఫోన్‌ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  
 

మరిన్ని వార్తలు