చెల్లి మరణంతో కుంగిపోయిన విజయ్‌.. డిప్రెషన్‌తో ఏడాది పాటు..

11 Jul, 2021 14:44 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌కున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనూ విజయ్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. విజయ్‌ తల్లిదండ్రులు కూడా ఇండస్ర్టీకి చెందినవారే. తండ్రి ప్రముఖ డైరెక్టర్‌ ఎస్‌ఏ చంద్రశేఖర్‌ కాగా తల్లి శోభ గాయనిగా, రచయిత్రిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక తండ్రి  డైరెక్షన్‌లో బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన విజయ్‌ ఆ తర్వాత నాలయై తీర్పు అనే యూక్షన్‌ మూవీతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాను కూడా ఆయన తండ్రి చంద్రశేఖరే డైరెక్ట్‌ చేశారు. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న విజయ్‌ వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఎంతో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఆయన జీవితంలో ఓ తీరని విషాదం నెలకొందని చాలా మందికి తెలియదు.


విజయ్‌కు విద్య అనే చెల్లెలు ఉండేది. ఇద్దరూ కలిసి ఎంతో అల్లరి చేస్తూ సరదాగా గడిపేవారు. చిన్న వయసులోనే విద్య అనారోగ్యం బారిన పడింది. వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. అలా రెండేళ్ల వయసులోనే విద్య చనిపోయింది. చెల్లి మరణంతో విజయ్‌ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 'స్కూలు నుంచి వచ్చాక విజయ్‌ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడు. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు.అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్‌ ఒకలాంటి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.


అప్పటిదాకా ఎంతో చలాకీగా, అల్లరి చేస్తూ గడిపిన విజయ్‌ విద్య దూరం అయ్యాక ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఎప్పుడూ ఒం‍టరిగా ఉండేవాడు. వయసుకు మించిన నెమ్మదితనం అలవర్చుకున్నాడు. ఇప్పటికీ  అంతే. ఆ బాధలోంచి విజయ్‌ కాస్త కోలుకోవడానికి ఏడాది సమయం పట్టింది' విజయ్‌ తల్లి వివరించింది. విద్య మరణంతో కుంగిపోయిన విజయ్‌ ముఖంలో నవ్వు కనిపించింది దానికి కారణం సినిమాలే అని పేర్కొంది. ఇక చెల్లెలిపై ఉన్న ప్రేమతో విజయ్‌ తన కూతురికి దివ్య సహాస అనే నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్‌ బీస్ట్‌తో పాటు, తెలుగులోనూ ఈ స్ట్రయిట్‌ ఫిల్మ్‌ చేయనున్నారు. 

మరిన్ని వార్తలు