Varisu Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్‌ 'వారీసు'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

20 Jan, 2023 15:23 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్‌ సహా తెలుగులోనూ పాజిటివ్‌ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్‌ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ దృష్ట్యా భారీ ధరకు అమెజాన్‌ వారీసు డిజిటల్‌ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 10న ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 

మరిన్ని వార్తలు