రష్మిక బ్యాడ్‌ లక్‌.. మంచి ఛాన్స్‌‌ మిస్సయ్యింది

4 Mar, 2021 14:13 IST|Sakshi

అతి తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా పాపులారిటీని దక్కించుకుంది  రష్మిక మందన్న.  కిరాక్కు పార్టీ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మను వరుస అవకాశాలు వరించాయి. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ఛలో చిత్రం సక్సెస్‌నిస్తే, ఆ తరువాత విజయ్‌దేవరకొండతో రొమాన్స్‌ చేసిన గీతగోవిందం సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా స్టార్‌ హీరోలతో జోడీ కడుతున్న ఈ భామ అటు కన్నడ, తెలుగు చిత్రాల్లో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది.

ఈ నేపథ్యంలోనే కోలీవుడ్‌లో ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కించుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. తమిళ ‘డాక్టర్‌’ సినిమా ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో మాస్‌ స్టార్‌ విజయ్ ‌ హీరోగా ఓ సినిమా రూపొంతునున్న సంగతి తెలిసిందే. విజయ్‌ నటిస్తున్న 65వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో విజయ్‌కు జోడీగా పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చినా రష్మికను తీసుకోవాలని భావించారట. అయితే తన బిజీ షెడ్యూల్‌ వల్ల డేట్స్‌ సర్దుబాటు చేయలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

దీంతో  రష్మిక ప్లేస్‌లో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డేను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది. మరోవైపు రష్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌ ‘పుష్ప’, శర్వానంద్‌ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాలతో పాటు హిందీలో ‘మిషన్‌ మజ్ను’ సినిమాలో నటిస్తుంది. తమిళంలో ఆమె నటించిన తొలి సినిమా ‘సుల్తాన్‌’ ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. 

చదవండి : (వైరల్‌: రష్మిక మందన్నా జడలో పూలు పెట్టిన ఫ్యాన్‌!)
(బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త)


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు