Thangalaan: విక్రమ్ తంగలాన్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

27 Oct, 2023 18:05 IST|Sakshi

పొన్నియిన్‌ సెల్వన్‌ వంటి సూపర్ హిట్ తరువాత విక్రమ్‌ నటించిన చిత్రం తంగలాన్‌. పార్వతి, మాళవిక మోహన్‌, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్‌ ఇది వరకే తెలిపారు. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని విక్రమ్‌ గెటప్‌ చాలా డిఫరెంట్‌గా ఉండి తంగలాన్‌ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. తాజాగా తంగలాన్‌ చిత్రానికి సంబంధించి మేకర్స్ బిగ్ అప్‌డేట్స్‌ ఇచ్చేశారు. 

ఓకేసారి టీజర్‌, మూవీ రిలీజ్ తేదీలను ప్రకటించారు. నవంబర్ ఒకటో తేదీన తంగలాన్ టీజర్‌ విడుదల చేస్తామని ట్విటర్ ద్వారా తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మరిన్ని వార్తలు