వనితపై బీజేపీ, కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం

25 Jul, 2020 08:44 IST|Sakshi

సాక్షి, చెన్నై : ఇటీవలే మూడో  వివాహం చేసుకున్న నటి వనిత విజయ్‌ కుమార్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఆమె తాజాగా రాజకీయ నాయకుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వనిత వివాహంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి వారిపై ఎదురు దాడి చేసే పనిలో భాగంగా  ఆమె తంజావూర్‌ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వనిత చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌ అవుతున్నాయి. (నటి వనితపై విమర్శలు.. యువతి అరెస్ట్)

ఆ వ్యాఖ్యలు ఆ ప్రాంత కాంగ్రెస్, బీజేపీ వర్గాలను ఆగ్రహానికి గురిచేశాయి. ఈ వ్యవహారంపై  తంజావూర్‌ జిల్లా, పుదుక్కొటై నగర పోలీస్‌ స్టేషన్‌లో  జిల్లా కాంగ్రెస్‌ యువజన పార్టీ కార్యదర్శి శివ ఫిర్యాదు చేశారు.  తంజావూరు మట్టికి, ప్రజలకు ఒక చరిత్ర ఉందని అన్నారు. అలాంటి ప్రజలను మనోభావాలను కించపరిచే విధంగా వనిత వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. తంజావూరు ప్రజలందరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వనితపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా తంజావూర్‌ కలెక్టర్‌ గోవిందరావు, ఎస్పీ దేశ్ముఖ్‌ శేఖర్‌ సంజయ్‌కు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజు ఫిర్యాదు చేశారు. వనిత వ్యాఖ్యలు తంజావూరు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసినట్లు పేర్కొన్నారు. ఆమె వెంటనే  తంజావూర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వనితపై చర్యలు తీసుకోవాలని కోరారు.  (టి మూడో పెళ్లి; ఫోటోలు వైరల్)

కాగా తన వ్యాఖ్యలపై వనితా ట్విటర్‌లో ... తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరారు. ఒకవేళ ఆ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే సహృదయంతో తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు