ఆగస్ట్‌ చివరి వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలు ఇవే

24 Aug, 2021 12:33 IST|Sakshi

కరోనా వల్ల థియేటర్లు పూర్తిక తెరచుకోని కారణంగా పలు చిత్రాలు ఇప్పటికీ ఓటీటీ బాటలోనే ముందుకెళ్తున్నాయి. కొన్ని సినిమాలు దైర్యం చేసి థియేటర్లలోకి వచ్చినప్పటికీ ఓటీటీల హవా తగ్గడంలేదు. వారానికి అరడజనుకు పైగా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. మరి ఈ ఆగస్ట్‌ చివరివారంలో ఓటీటీ, ధియేటర్లలో విడుదల కానున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం. 

శ్రీదేవి సోడా సెంటర్‌
సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్దాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్‌ ఆ అంచనాలు మరింత పెంచాయి.ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు.

ఇచట వాహనములు నిలుపరాదు
యంగ్ హీరో సుశాంత్ నటించిన తాజా సినిమా ‘ఇచ్చ‌ట‌ వాహ‌న‌ములు నిలుప‌రాదు’.ఎస్.దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు . కమర్షియల్ అంశాలతో అలరించే పూర్తి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. 

హౌజ్‌ అరెస్ట్‌
శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, రవిబాబు, రఘు, తాగుబోతు రమేశ్‌ కలిసి నటించిన చిత్రం ‘హౌజ్‌ అరెస్ట్‌’. శేఖర్‌ రెడ్డి యర్నా దర్శకుడు.  పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో రూపొందింది ఈ చిత్రం ఇది.  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.ఈ మూవీ కూడా ఆగస్ట్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

వివాహ భోజనంబు
హాస్య నటుడు సత్య హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’ కూడా  ఆగస్ట్‌ 27న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఒటిటి సోనీలైవ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఓటీటీ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌


ఆహా
ఎస్‌.ఆర్‌ కల్యాణమండపం (ఆగస్టు 27)
 

అమెజాన్‌ ప్రైమ్‌

స్టాండప్‌ షార్ట్స్‌ (ఆగస్టు 26)

ద కొరియర్‌ (ఆగస్టు 27)

సోనీ లైవ్‌
వివాహ భోజనంబు (ఆగస్టు 27)

కసడా తపరా (ఆగస్టు 27)

నెట్‌ఫ్లిక్స్‌ 
అన్‌టోల్డ్‌ (ఆగస్టు 24)

పోస్ట్‌ మార్టమ్‌ (ఆగస్టు 25)

భూమిక (ఆగస్టు 26)

హీజ్‌ ఆల్‌ దట్‌ (ఆగస్టు 27)

జీ 5
ఇంజినీరింగ్‌ గర్ల్స్‌ (ఆగస్టు 27)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు