ఈ వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలు ఇవే

17 Aug, 2021 11:17 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ పుణ్యమా అని మూతపడిన థియేటర్లు మళ్లీ తెరుచుకోవడంతో  సినిమాల సందడి మొదలైంది. మొన్నటిదాకా ఓటీటీలలో సినిమాలు చూసి విసిగిపోయిన సినీ ప్రేక్షకులు.. థియేటర్ల బాట పట్టారు. దీంతో నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు క్యూ కడుతున్నారు. ప్రతి వారం అర డజనుకు పైగా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. గత వారం పాగల్‌, ఓరేయ్‌ బామ్మర్థి, బ్రాందీ డైరీస్‌తో పాటు మరో ఆరు సినిమాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  ఇక ఈ వారం ఓటీటీ, ధియేటర్లలో విడుదల కానున్న సినిమాలు ఎంటో ఓ లుక్కేద్దాం. 


రాజ రాజ చోర
యంగ్‌ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్‌, సునైన హీరోయిన్లు. హితేశ్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో శ్రీవిష్ణు స్మార్ట్  దొంగ‌గా హిలేరియ‌స్ పాత్రలో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 19న థియేటర్స్‌లో విడుదల కానుంది. 


కనబడుటలేదు
హీరో సునీల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కనబడుటలేదు’.ఇందులో సునీల్‌ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ప్రేమకథను జోడించి దర్శకుడు బాలరాజు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం  ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 


క్రేజీ అంకుల్స్‌

యాంకర్‌ శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్‌’. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. గుడ్‌ సినిమా గ్రూప్స్, గ్రీన్‌ మెట్రో మూవీస్, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న  విడుదలవుతోంది. 


బజార్‌ రౌడీ

సంపూర్ణేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బజార్‌ రౌడీ’. డి. వసంత నాగేశ్వర రావు దర్శకుడు. మహేశ్వరి వద్ది కథానాయిక. బోడెంపూడి కిరణ్‌ కుమార్‌ సమర్పణలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. చిత్రం ఆగస్ట్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌

అమెజాన్‌ ప్రైమ్‌
ద స్కెలిటన్‌ ట్విన్స్‌ (ఆగస్టు 17)
నైన్‌ పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ (ఆగస్టు 18)
అన్నెట్టే (ఆగస్టు 20)
కిల్లర్‌ ఎమాంగ్‌ అజ్‌ (ఆగస్టు 20)
హోమ్‌ (ఆగస్టు 19)

నెట్‌ఫ్లిక్స్‌
కామెడీ ప్రీమియం లీగ్‌ కామెడీ షో (ఆగస్టు 20)
స్వీట్‌గర్ల్‌ (ఆగస్టు 21)

ఆహా
తరగతి గది దాటి  ( ఆగస్టు 20)

జీ 5
200 హల్లా హో  (ఆగస్టు 20)
ఆల్ట్‌ బాలాజీకార్టెల్‌ (ఆగస్టు 20)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు