ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే

2 Aug, 2021 16:05 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖంపట్టడంతో సినిమా సందడి మళ్లీ మొదలైంది. థియేటర్లు ఓపెన్‌ కావడంతో సీనీ ప్రియులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే గత వారం దాదాపు ఆరు సినిమాలూ విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో మరికొన్ని సినిమాలు ఓటీటీల్లో సందడి చేశాయి. తిమ్మరుసు, ఇష్క్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దాం.

ఎస్.ఆర్.కళ్యాణమండపం
‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’డిఫరెంట్‌ టైటిల్‌తో వస్తున్నాడు. శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రియాంకా జవాల్కర్‌ హీరోయిన్‌. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఆగస్ట్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ముగ్గురు మొన‌గాళ్లు
శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ముగ్గురు మొన‌గాళ్లు’. అభిలాష్ రెడ్డి దర్శక‌త్వం వ‌హిస్తున్నారు. చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ముగ్గురు వ్యక్తులకు సంబంధించనే ఈ సినిమా కథ.  వీరిలో ఒకరికి కనిపించదు. మరొకరికి వినిపించదు. ఇంకొకరు మూగ. ఈ ముగ్గురు దివ్యాంగుల జీవితంలో ఊహించని విధంగా క్రైమ్ చోటు చేసుకుంటుంది. అదేమిటీ? దాని నుండి వీరు ఎలా బయటపడ్డారు? అసలు నగరంలో జరిగే హత్యలకు వీళ్ళకు ఏమిటీ సంబంధం? అనేదే ఈ చిత్ర కథ.  ఈ సినిమాలో రాజా ర‌వీంద్ర, దివంగ‌త న‌టుడు టీఎన్ఆర్  కీల‌క పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెరిసే మెరిసే
'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా 'మెరిసే మెరిసే'.  కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పుడు కాక ఇంకెప్పుడు
హస్వంత్‌ వంగ, నమ్రత దరేకర్‌, కల్యాణ్‌ గౌడ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. వై.యుగంధర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భరణి, తులసి, రాజా రవీంద్ర, పూజా రామచంద్రన్‌, ఐడ్రీమ్‌ అంజలి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమా కూడా ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సాహిత్య సాగర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

క్షీరసాగర మథనం
 మానస్‌ నాగులపల్లి, సంజయ్‌ రావు‌, అక్షంత్‌ సోనేశ్వర్‌,  గౌతమ్‌ ఎస్‌ శెట్టి, ఛరిష్మా, మహేశ్‌ కొమ్ముల తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం క్షీరసాగర మథనం. అనిల్‌ పంగులూరి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకానుంది. 


ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ఆగస్ట్‌ 04, 2021
మనోజ్‌ బాజ్‌పాయ్‌ ‘డయల్‌ 100’(జీ5)
మాన్‌స్టర్స్‌ ఎట్‌ వర్క్‌ (డిస్నీ+ హాట్‌స్టార్‌)
టర్నర్‌ అండ్‌ హూచ్‌ (డిస్నీ+ హాట్‌స్టార్‌)
 ఐ మే డెస్ట్రాయ్‌ యు(సీజన్‌-1) హెచ్‌బీవో
షార్ట్‌సర్క్యూట్‌ సీజన్‌-1 (డిస్నీ+ హాట్‌స్టార్‌)

ఆగస్టు 6, 2021
బ్రేకింగ్‌ బాబీ బోన్స్‌(సీజన్‌-1) (నేషన్‌ జియోగ్రాఫిక్‌)
స్టార్‌ వార్స్‌: ది బ్యాడ్‌ బ్యాచ్‌(డిస్నీ+ హాట్‌స్టార్‌)
ది మిస్టీరియస్‌ బెనిడిక్ట్‌ సొసైటీ((డిస్నీ+ హాట్‌స్టార్‌)
స్టార్‌ వార్స్‌: గార్డెన్‌ రామ్‌సే: అన్‌ ఛార్టెడ్‌(డిస్నీ+ హాట్‌స్టార్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు