Vijay Deverakonda: విజయ్‌ అహంకారి.. నాశనమయ్యే సమయం దగ్గరపడింది: థియేటర్‌ యజమాని

26 Aug, 2022 20:15 IST|Sakshi

లైగర్‌ మూవీతో బాలీవుడ్‌లో గ్రాండ్‌గా లాంచ్‌ అవుదామనుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ప్రమోషన్స్‌లో భాగంగా దేశంలోని ప్రధానమైన పదిహేడు నగరాలను తిరిగాడు. తీరా సినిమా రిలీజయ్యాక లైగర్‌ టాక్‌ మరోలా ఉంది. దీంతో రౌడీ హీరో ఆశలు అడియాసలయ్యాయి. అతడు పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. సినిమా రిలీజ్‌కు ముందు అతడు చేసిన కామెంట్లు కూడా ఈ వైఫల్యానికి కారణమేనంటున్నాడో థియేటర్‌ యజమాని.

తాజాగా ముంబైలోని ఓ థియేటర్‌ యజమాని మనోజ్‌ దేశాయ్‌.. విజయ్‌పై ఫైర్‌ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'మా సినిమాను బాయ్‌కాట్‌ చేసుకోండి అని చెప్పి తెలివిని ప్రదర్శించాననుకుంటున్నావా? కనీసం ఓటీటీలో కూడా సినిమా చూడరు. నీ ప్రవర్తన వల్ల మేము నష్టపోతున్నాం, అడ్వాన్స్‌ బుకింగ్స్‌పై కూడా దాని ఎఫెక్ట్‌ పడింది. మిస్టర్‌ విజయ్‌.. నువ్వు కొండవి కాదు అనకొండవి. అనకొండలాగే మాట్లాడావు. వినాశకాలే విపరీతబుద్ధి అంటారు. అయినా నాశనమయ్యే సమయం దగ్గరపడ్డప్పుడు నోటినుంచి ఇలాంటి మాటలే వస్తాయి, నువ్వు అలాగే మాట్లాడావు కూడా! అయినా అది నీ ఇష్టం.

విజయ్‌, నువ్వు చాలా అహంకారివి. నచ్చితే చూడండి, ఇష్టం లేకపోతే అసలు చూడకండి అన్న మాటలు ఎంత చేటు తెచ్చాయో నీకింకా అర్థం కావడం లేదా? ఆమిర్‌ ఖాన్‌, తాప్సీ, అక్షయ్‌ కుమార్‌ సినిమాలు ఎలా కొట్టుకుపోయాయో చూడలేదా? లైగర్‌ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడటం వల్ల చాలా నష్టం జరిగిపోయింది' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: లైగర్‌ ఫ్లాప్‌తో బాధలో విజయ్‌, కాలర్‌ ఎగరేసే రోజులొస్తాయంటున్న ఫ్యాన్స్‌
హృతిక్‌.. కంగనా ప్రైవేట్‌ ఫొటోలు చూపించాడు

మరిన్ని వార్తలు