తెల్లవారితే గురువారం: నెల రోజులైనా కాకముందే ఒటీటీలో

12 Apr, 2021 18:27 IST|Sakshi

సూపర్‌ హిట్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు‌, 'నెంబర్‌ 1 యారి', 'సామ్‌ జామ్‌' వంటి టాక్‌ షోలతో అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోంది ఆహా. ఇప్పటికే 'జాంబిరెడ్డి', రవితేజ 'క్రాక్'‌, అల్లరి నరేష్‌ 'నాంది' సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చిన ఆహా తాజాగా మరో కొత్త సరుకును మోసుకొచ్చింది. ఇటీవలే రిలీజైన 'చావు కబురు చల్లగా', 'తెల్లవారితే గురువారం' చిత్రాలను అందుబాటులోకి తెస్తోంది.

'మత్తు వదలరా' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయడు శ్రీ సింహా లేటెస్ట్‌గా నటించిన చిత్రం తెల్లవారితే గురువారం. వెరైటీ టైటిల్‌, ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఓ మోస్తరు ప్రభావాన్ని చూపించింది. మిషా నారంగ్‌, కృష్ణవేణి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మార్చి 27న విడుదలైంది. కనీసం నెల రోజులైనా కాకముందే ఏప్రిల్‌ 16న అంటే ఈ శుక్రవారం ఆహా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది.

బస్తీ బాలరాజుగా కార్తికేయ నటించిన తాజా చిత్రం చావు కబురు చల్లగా. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. మార్చి 19న రిలీజైన ఈ మూవీ ఆహాలో ఈ నెల 23 నుంచి ప్రసారం కానుంది. మరోవైపు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన లెవంత్‌ అవర్ వెబ్‌ సిరీస్‌ ఇప్పటికే‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో హౌస్‌ఫుల్‌ బోర్డ్‌ పెట్టింది ఆహా!

చదవండి: ‘తెల్లవారితే గురువారం’ మూవీ రివ్యూ

‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు