అడగాల్సినవి ఎన్నెన్నో..!

22 Aug, 2021 05:03 IST|Sakshi

వీలు కుదిరినప్పుడల్లా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేస్తూ వారిని అలరిస్తుంటారు శ్రుతీహాసన్‌. తాజాగా మరోసారి తన అభిమానులు, నెటిజన్లతో శ్రుతి చాట్‌ చేశారు. ఈ చాట్‌ సెషన్‌లో భాగంగా ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోనున్నారు’ అన్న ఓ నెటిజన్‌ ప్రశ్నకు శ్రుతీహాసన్‌ బదులిస్తూ – ‘‘నిజాయితీగా చెప్పాలంటే ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల (కరోనాను ఉద్దేశిస్తూ) నుంచి బయటపడాలి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి.

అడగాల్సిన ప్రశ్నలూ ఎన్నో ఉన్నాయి’’ అన్నారు. ఇక.. ఈ చాట్‌ సెషన్‌లోనే ‘సెక్స్‌ లేదా ఫుడ్‌?’ దేనికి ప్రిఫరెన్స్‌ అంటూ అడిగిన మరో నెటిజన్‌ ప్రశ్నకు.. ‘ఆహారం లేకపోతే మనం బతకలేం’ అని శ్రుతీహాసన్‌ బదులు చెప్పారు. ఇంకా తనకు బ్లాక్‌ కలర్‌ అంటే ఇష్టమని, పాములంటే భయమని, మ్యూజిక్‌లో ఉన్న మ్యాజిక్‌ తనకు ఇష్టమని నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం శాంతను అనే చిత్రకారుడితో శ్రుతి ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు