Puneeth Rajkumar: ఏం పాపం చేశాడు దేవుడా! శోకసంద్రంలో అభిమానులు

30 Oct, 2021 11:00 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: తమ అభిమాన హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ను కడసారి దర్శించుకునేందుకు అభిమానులు ఉప్పెనలా తరలివస్తున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో అంతిమ నివాళులర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా శోకసంద్రంలో మునిగిన అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. సంద్రాన్ని తలపించేలా వస్తున్న అభిమానులు ‘‘అప్పూ.. మిస్‌.. యూ’’ అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. దేవుడా  ఏం తప్పు చేశాడని  కోట్లాది మంది అభిమానుల ప్రాణాలను తీసుకుపోయావు అంటూ రోదిస్తున్నారు.

పునీత్‌ తల్లిదండ్రులు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మ అంత్యక్రియలు జరిగిన కంఠీరవ స్టేడియంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విదేశాల్లో ఉన్న పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారు.  మరోవైపు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో కంఠీరవ స్టేడియంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం వెల్లడించారు. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం బొమ్మై దివంగత నటుడికి నివాళులర్పించారు.(Puneeth Rajkumar: పునీత్‌, అశ్విని రేవంత్‌ లవ్‌ స్టోరీ..వైరల్‌)

కాగా 46 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ  పునీత్ రాజ్‌కుమార్‌  శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.  అప్పూకి అంతిమ నివాళులర్పించేందుకు వీలుగా ఆయన భౌతిక కాయాన్ని స్టేడియంకు తరలించారు.  (Puneeth Rajkumar:పునీత్‌ ఔదార్యాన్ని చూడలేక విధికి కన్నుకుట్టింది

)

మరిన్ని వార్తలు