సినీ దర్శకుడిపై ఫిర్యాదు .. 'పద్మప్రియ ఫోన్‌ నంబర్‌ ఇవ్వకుంటే నీ భార్యను..'

13 Sep, 2022 15:33 IST|Sakshi

నటి మొబైల్‌ నంబర్‌ ఇవ్వకుంటే నీ భార్యను మానభంగం చేస్తానని బెదిరించిన దర్శకుడిపై చాయాగ్రాహకుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. రామాపురంపోలీసుల కథనం మేరకు.. రామాపురం, భారతీవీధికి చెందిన ఎంఎస్‌ ప్రభు 30 ఏళ్లుగా సినీ చాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నాడు.

ఏఎల్‌ సూర్య

ఇతనికి 2006లో ఏఎల్‌ సూర్య అనే దర్శకుడు పరిచయం అయ్యాడు. నటి పద్మప్రియతో భారతీయార్‌ పాటను వీడియోగా రూపొందించి ఇవ్వాల్సిందిగా సూర్య అడిగాడు. ఆ వీడియోలు రూపొందించి ఇవ్వడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.

అయితే కొంతకాలం తర్వాత దర్శకుడు ఏఎల్‌ సూర్య తనకు నటి పద్మప్రియను పరిచయం చేయాల్సిందిగా ప్రభును కోరాడు. ఆమె ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఎందుకని ప్రశ్నించడంతో గొడవ పడ్డాడు. పద్మప్రియ ఫోన్‌ నంబర్‌ ఇవ్వకుంటే నీ భార్యను మానభంగం చేస్తానని బెదిరించారని బాధితుడు ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

చదవండి: (తెలంగాణ ఇంటెలిజెన్స్‌ మరో ఫెయిల్యూర్‌)

మరిన్ని వార్తలు