అజిత్‌ సినిమా కంటే ముందు వారసుడు చూస్తా: తునివు డైరెక్టర్‌

18 Dec, 2022 18:03 IST|Sakshi

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మించిన వారసుడు మూవీకి మొదట మహేశ్‌బాబునే హీరోగా అనుకున్నారు. కానీ ఆయన వేరే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండటంతో కుదరలేదు. తర్వాత రామ్‌చరణ్‌తో చేద్దామనుకున్నా ఆయన కూడా ఖాళీగా లేకపోవడంతో చివరకు కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ దగ్గరకు వెళ్లిందీ ప్రాజెక్ట్‌. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళంలో విడుదల కానుంది.

ఈ క్రమంలో దిల్‌ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'విజయ్‌ తమిళనాడులో నెంబర్‌ వన్‌ హీరో.. అజిత్‌ కంటే పెద్ద స్టార్‌. కానీ వారిసు, అజిత్‌ తునివు ఒకేరోజు విడుదలవుతున్నాయి. అందువల్ల తమిళనాడులో 800 థియేటర్లలో 50:50 ఇస్తామన్నారు. కానీ విజయ్‌ నెంబర్‌ వన్‌ హీరో కాబట్టి 50 థియేటర్లు అదనంగా కావాలి' అని మాట్లాడటంతో ఎంత పెద్ద వివాదం ముసురుకుందో తెలిసిందే! దిల్‌రాజుపై, అతడి వ్యాఖ్యలపై అజిత్‌ అభిమానులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. విజయ్‌ కంటే అజితే గ్రేట్‌ అని, మధ్యలో నువ్వేంది చెప్పేదని విమర్శించారు. అలా మా హీరో తోపంటే మా హీరో తోపని విజయ్‌, అజిత్‌ ఫ్యాన్స్‌ కొట్టుకున్నంత పని చేశారు. దీనిపై దిల్‌రాజు దిగొచ్చి తానెవరినీ తక్కువ చేసి మాట్లాడలేదని, పూర్తి ఇంటర్వ్యూ చూసుంటే మీకర్థమయ్యేదని సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా తునివు డైరెక్టర్‌ హెచ్‌ వినోద్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. తునివు, వారిసు.. వీటిలో ఏ సినిమా ముందు చూస్తారు? అన్న ప్రశ్నకు ఆయన.. విజయ్‌ 'వారిసు' సినిమానే చూస్తానన్నాడు. ఎందుకంటే తునివు సినిమాను ఇప్పటికే చాలాసార్లు చూసేశా కాబట్టి వారిసు చూస్తానంటూ తెలివిగా సమాధానమిచ్చాడు.

చదవండి: సినిమా పోస్టర్‌ను కూడా వదలవా? నిర్మాతపై మళ్లీ ట్రోలింగ్‌
సూట్‌కేస్‌ రిజెక్ట్‌ చేసిన ఫైనలిస్టులు

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు