Varisu Vs Thunivu: ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చాయంటే?

12 Jan, 2023 17:54 IST|Sakshi

సౌత్‌లో సంక్రాంతి హడావుడి పీక్స్‌లో ఉంది. బాక్సాఫీస్‌ వద్ద స్టార్‌ హీరోల సినిమాలు క్లాష్‌ అవుతుండటంతో ఎవరు విన్నర్‌గా నిలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సంక్రాంతి పందేలుగా బరిలో దిగగా తమిళనాట అజిత్‌ తునివు, విజయ్‌ వారీసు(వారసుడు) బాక్సాఫీస్‌ వద్ద పోటీపడుతున్నాయి. ఈ రెండు సినిమాలు జనవరి 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే! ఈ రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్లు కలిపితే రూ.50 కోట్ల గ్రాస్‌ కన్నా తక్కువే ఉన్నాయట.

తమిళనాడులో తునివు మొదటిరోజు పాతిక కోట్ల మేర కలెక్షన్స్‌ కురిపించగా వారీసు దాదాపుగా రూ.20 కోట్లదాకా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తమిళనాడు కాకుండా ఇతర ప్రాంతాలు, విదేశీ వసూళ్లు కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రెండు సినిమాలు బాక్సాఫీస్‌ విన్నర్‌గా నిలిచేందుకు తెగ పోటీపడుతున్నాయి. కాగా తొమ్మిదేళ్ల తర్వాత అజిత్‌, విజయ్‌ సినిమాలు ఒకేరోజు రిలీజ్‌ అయ్యాయి. దీంతో ఫస్ట్‌డే ఫస్ట్‌ షో చూడాలన్న ఫ్యాన్స్‌ అత్యుత్సాహం వల్ల కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

చదవండి: తండ్రి మరణించిన రెండు రోజులకే సెట్‌కు వచ్చేశాడు: చిరంజీవి
థియేటర్‌లో పూజారి మాస్‌ డ్యాన్స్‌

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు